ఆచార్య సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత కనీసం నెల రోజులు కూడా గడవకముందే 'ఓ టి టి' స్ట్రీమింగ్ కి రెడీ అయిపోవటం ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందికరమైన అంశమే.
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. తండ్రీ కొడుకులు తొలి సారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటూండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్స్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకి మరింత హైపు క్రియేట్ అయింది. ఈ రోజే (ఏప్రిల్ 29) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాల్ని అందుకోలేక చతికిల పడింది.
దాదాపు 130 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కనీసం 50 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేక పోయింది.చిరంజీవి, చరణ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నా కలిసి రాలేదు. ఈ నేపధ్యంలో రిలీజ్ రోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చేయటంతో చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ మెగా మల్టీస్టారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ తాజాగా ప్రకటించింది. ఆచార్య సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత కనీసం నెల రోజులు కూడా గడవకముందే 'ఓ టి టి' స్ట్రీమింగ్ కి రెడీ అయిపోవటం ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందికరమైన అంశమే. అయితే థియేటర్ లలో చూడలేక పోయిన ఆచార్య సినిమా ని 'ఓ టి టి' ద్వారా చాలా మంది చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటిటిలో మంచి వ్యూస్ వస్తాయని ఎక్సెపెక్ట్ చేస్తున్నారు.గతంలో నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రంలాగే ఈ చిత్రం ఓటిటిలో రికార్డ్ లు క్రియేట్ చేస్తుందంటున్నారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిష్షూ సేన్ గుప్త, సౌరవ్ లోకేశ్, అజయ్, కిశోర్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, నాజర్, బెనర్జీ, శత్రు, రాజా రవీంద్ర, సత్యదేవ్, సంగీత, ప్రభు, రెజీనా కాసాండ్రా నటించిన ఈ చిత్రానికి ...
సినిమాటోగ్రఫి: తిరు
సంగీతం: మణి శర్మ
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సమర్పణ: సురేఖ కొణిదెల
రచన, దర్శకత్వం: కొరటాల శివ
