బాలీవుడ్ లో తెరకెక్కిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ కి విపరీతమైన ప్రేక్షకాదారణ దక్కింది. అమ్మాయిలూ, సెక్స్ కోరికల చుట్టూ నడిచే ఈ సిరీస్ కి మంచి వ్యూస్ దక్కాయి. కియారా అద్వానీ ఈ సిరీస్ లో హాట్ గా నటించి కుర్రాళ్లను ఆకర్షించింది.

ఇప్పుడు ఆ సిరీస్ ని సౌత్ లో తీయాలని భావిస్తున్నారు. హిందీలో 'లస్ట్ స్టోరీస్' నిర్మాతల్లో ఒకరైన రోనీ స్క్రూవాలా ఈ సిరీస్ ని తెలుగులో తీయడానికి సిద్ధమయ్యాడు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డితో పాటు నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ వంటి దర్శకులు కలిసి తెలుగులో నాలుగు సెగ్మెంట్లను డైరెక్ట్ చేయబోతున్నారు. 

ఈ సిరీస్ లో ఒక హీరోయిన్ గా మలయాళ భామ అమలాపాల్ ని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ఆరంభంలో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన అమలాపాల్ ఈ మధ్య మళ్లీ ఆ తరహా పాత్రల వైపు అడుగులువేస్తోంది. ఈ క్రమంలో 'లస్ట్ స్టోరీస్'లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో జగపతిబాబు కూడా కనిపించనున్నాడని సమాచారం.

కథ ప్రకారం జగపతి బాబు రిచ్ బాస్ పాత్రలో కనిపిస్తాడట. అతడి దగ్గర పని చేసే ఎంప్లాయ్ గా అమలా కనిపిస్తుందట. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగడం, కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. తనకంటే వయసులో పెద్ద వాడైన జగపతిబాబుతో రొమాన్స్ చేయడానికి అమలా సిద్ధమవ్వడం షాకిస్తోంది.