సినిమా సెలెబ్రిటీలకు సోషల్ మీడియా చాలా ముఖ్యం. తమకి తాము ప్రచారం చేసుకునేందుకు సినీ తరాలకు సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తో పాటు ప్రస్తుతం టిక్ టాక్ కూడా అందరిని ఊపేస్తోంది. టిక్ టాక్ ప్రస్తుతం చాలా వేగంగా విస్తరిస్తోంది. 

లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తమ సంతోషాలని వీడియోల రూపంలో బబంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోల్ని మరింత అందంగా తీర్చిదిద్దే అవకాశం టిక్ టాక్ కల్పిస్తోంది. దీనితో ప్రతి ఒక్కరూ టిక్ టాక్ పట్ల ఆకర్షితులవుతున్నారు. 

@allusirish

తిక్తాక్ లో చాట్ చేద్దామా మరి? ##allusirish

♬ Stranger - CHUNNYT

లాక్ డౌన్ కారణంగా అల్లువారబ్బాయి శిరీష్ టిక్ టాక్ లో అభిమానులతో ముచ్చటించేందుకు రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 10 అంటే నేటి సాయంత్రం 5 గంటలకు తాను టిక్ టాక్ లైవ్ లోకి వస్తున్నట్లు, అభిమానులతో చాట్ చేయబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు. దీనితో అభిమానులంతా సిద్ధంగా ఉండాల ని శిరీష్ కోరాడు. 

శిరీష్ చివరగా ఎబిసిడి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. శిరీష్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.