అల్లు శిరీష్ కు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడాల్సి వస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ శిరీష్ కు ఒడిదుడుకులు తప్పడం లేదు. అల్లు శిరీష్ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే 'శ్రీరస్తు శుభమస్తు' అనే చెప్పాలి. పరుశురాం దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించింది. 

ఇక అల్లు శిరీష్ నటించిన మిగిలిన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేదు. శిరీష్ చివరగా నటించిన చిత్రం ABCD. ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది.  ABCD తర్వాత శిరీష్ మరో చిత్రాన్ని ఖరారు చేయలేదు. ఎట్టకేలకు శిరీష్ తదుపరి చిత్రం ఓకే అయినట్లు సమాచారం. 

అల్లు శిరీష్ ని డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు మరెవరో కాదు.. 'విజేత' ఫేమ్ రాకేష్ శశి. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన విజేత చిత్రానికి రాకేష్ దర్శకుడు. ఆ మూవీ పర్వాలేదనిపించింది. రాకేష్ చెప్పిన ప్రేమ కథ అల్లు శిరీష్ కు నచ్చడంతో ఓకే చెప్పాడట. 

జానీ చిత్రానికి పవన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలతో పాటు, ఎమోషనల్ డోస్ కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తనకు సూటయ్యే ప్రేమ కథ దొరకడంతో శిరీష్ హ్యాపీగా ఈ చిత్రానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.