త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల.. వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఎట్టకేలకు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. నా పేరు సూర్య డిజాస్టర్ తో వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన బన్నీ మంచి సినిమాతో హిట్టందుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. బన్నీ అందుకున్న సక్సెస్ కు చాలా మంది సినీ ప్రముఖులు వారి స్టైల్ లో విషెస్ అందిస్తున్నారు.

ఇకపోతే కలెక్షన్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా రెండు రికార్డులను ఒకేసారి అందుకున్నాడు. అల.. వైకుంఠపురములో యూఎస్ లో ఈజీగా 1.5 మిలియన్ డాలర్స్ ను అందుకుంది. రీసెంట్ గా 2 మిళియన్స్ డాలర్స్ ని కూడా క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు $1.5మిలియన్స్ ని దాటినప్పటికీ. బన్నీ స్పీడ్ చూస్తుంటే మహేష్ ఆ రికార్డ్ ని బీట్ చేయడం సాధ్యం కాదనే తెలుస్తోంది.

పైగా బన్నీ కంటే ముందే మహేష్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అల వైకుంఠపురములో బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.  గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ - మహేష్ బాబు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ జరుగుతోంది. అయితే సినిమాకు సంబందించిన యూఎస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు సినిమాలు ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యాయి. ప్రవాసులు కూడా పండగ సమయంలో తెలుగు సినిమాలను ఏ మాత్రం మిస్సవ్వడం లేదు.

మహేష్ బాబు గత సినిమాలు చాలా వరకు యూఎస్ లో భారీ వసూళ్లను అందుకున్నవే. అయితే ఇక అల వైకుంఠపురములో సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ గత సినిమాలు కూడా అమెరికాలో మిలియన్ డాలర్స్ అందుకున్నవే.దీంతో బన్నీ క్రేజ్ కంటే త్రివిక్రమ్ మార్క్ అక్కడ ఎక్కువగా ఉపయోగపడింది. కేవలం మహేష్ క్రేజ్ ద్వారానే సరిలేరు యూఎస్ జనాలను ఆకర్షించనుంది. ఫైనల్ గా త్రివిక్రమ్ ద్వారా బన్నీ యూఎస్ లో తన మార్కెట్ ని పెంచుకొని సంక్రాంతి విన్నర్ గా దూసుకుపోతున్నాడు.