'అల.. వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బన్నీ నమోదు చేస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు యూఎస్ లో కూడా అదే తరహాలో రికార్డులు అందుకుంటున్నాడు. మహేష్ బాబు - అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి.

అయితే ఆ లిస్ట్ లో అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా మహేష్ సినిమా కంటే ముందుగానే 100కోట్ల షేర్స్ ని దాటేసింది. ఇక ఫైనల్ గా అల వైకుంఠపురములో ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇటీవల అమెరికాలో సినిమా 2.8మిలియన్ డాలర్స్ ను అందుకొని సైరా ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ 3వ స్థానంలో ఉన్న రంగస్థలం ($3.5M) రికార్డ్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.

నాలుగవ స్థానంలో 3. 4మిళియన్స్ తో భరత్ అనే నేను ఉండగా ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్ లో సైరా ని వెనక్కి నెట్టేసి 'అల..వైకుంఠపురములో' నిలిచింది. ఇక సోమవారం కలెక్షన్స్ తో ఈ సినిమా 3మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఈ కలెక్షన్స్ తో బన్నీ - త్రివిక్రమ్ యూఎస్ బెస్ట్ హిట్స్ అందుకున్నారు.  ఆరు రోజుల్లో 104కోట్ల షేర్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పోస్టర్ ని రిలీజ్ చేసింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వేగంగా బన్నీ 100కోట్ల షేర్స్ అందుకున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133కోట్లు. సినిమా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే వీకెండ్ లో కూడా కలెక్షన్స్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ తో కొనసాగుతోంది అంటే సినిమా ఈ రిపబ్లిక్ డే వరకు మరీన్నీ లాభాలని అందిస్తుందని చెప్పవచ్చు.