ఫ్యామిలీకి మొదట ప్రాధాన్యత నిచ్చే టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఇక ఇంట్లో ఉంటే తన పిల్లలకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తారు. బన్నీ తరచుగా తన కుమార్తె అర్హతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా బన్నీ తన ముద్దుల కొడుకు అల్లు అయాన్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. అల్లు అయాన్ చదువుకునే స్కూల్ లో 'ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలెబ్రేషన్స్' జరిగాయి. ఇందులో భాగంగా అల్లు అయాన్ సూపర్ స్టైలిష్ గా వేదికపై నిలుచుని ఉన్న ఫోటోని బన్నీ ట్విటర్ లో షేర్ చేశాడు. 

మన ఊరికి కరోనా వస్తే.. అంతపెద్ద ఫిగారా అది.. నాగబాబుపై విమర్శల వర్షం!

'అయాన్ నువ్వు ఇంత బాగా ఎదుగుతున్నందుకు గర్వంగా ఉంది. నా కుమారుడికి జీవిత విలువలు నేర్పుతున్న, వాడి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న బోధివాలి స్కూల్ కు కృతజ్ఞతలు. ఈ పాఠశాలలో మా అబ్బాయిని చేర్పించి తల్లి దండ్రులుగా మంచి నిర్ణయం తీసుకున్నాం. బోధివాలి స్కూల్ సిబ్బందికి నా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 

కుర్ర యాంకర్ హాట్ ఫోటోస్.. నడుము అందాలతో సెక్సీగా..

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. బన్నీ చివరగా నటించిన అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.