కొంతకాలంగా అల్లు అర్జున్ సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. రైటర్స్ టీమ్ ని ఏర్పాటు చేసుకొని రోజూ కథలు వింటూ తనకు నచ్చిన కథలను ప్రొడ్యూస్ చేయాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు చేసినట్లు కూడా చెప్పుకున్నారు. తను నటిస్తోన్న 'అల.. వైకుంఠపురములో' చిత్రానికి భాగస్వామిగా  వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

కానీ అల్లు అర్జున్ మాత్రం గీతాఆర్ట్స్ ని సినిమా నిర్మాణంలో భాగంగా చేసి తనపై వస్తోన్న రూమర్స్ కి టెంపరరీగా బ్రేక్ వేశాడు. హారిక హాసిన సంస్థలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి అల్లు అరవింద్ పేరు యాడ్ అయ్యేలా చేసింది అల్లు అర్జునే అని సమాచారం. నిజానికి అల్లు శిరీష్ తన తండ్రి బాటలో నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటారని భావించారు.

కానీ అతడికి నటనపై ఆసక్తి కలగడంతో హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తన పెద్ద కొడుకు అల్లు బాబీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాడు. వరుణ్ తేజ్ హీరోగా సినిమా కూడా అనౌన్స్ చేశారు. దీంతో గీతాఆర్ట్స్ ని అల్లు అర్జున్ టేకోవర్ చేయబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఇకపై తను నటించే చిత్రాలకు గీతాఆర్ట్స్ ని భాగస్వామిగా చేసి ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాడు.

తన స్నేహితడు బన్నీ వాసుతో కలిసి గీతాఆర్ట్స్ పై ఇతర చిత్రాలను కూడా నిర్మించాలనేది అల్లు అర్జున్ ప్లాన్. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ టేకోవర్ చేయడం,ప్రభాస్ కి సొంత నిర్మాణ సంస్థ యువి ఎలానూ ఉంది, మహేష్ కూడా తన సొంత బ్యానర్ ని ప్రోత్సహిస్తుండడంతో అల్లు అర్జున్ కూడా గీతాఆర్ట్స్ లెగసీని కొనసాగించాలని భావిస్తున్నాడట.

అదే గనుక జరిగితే ఓ పక్క నిర్మాతగా, మరోపక్క హీరోగా బన్నీ తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది. అల్లు అరవింద్ గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించాడు. తన తండ్రి మొదలెట్టిన నిర్మాణ సంస్థని కొనసాగించే బాధత్యలు బన్నీ తీసుకోనున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్!