Asianet News TeluguAsianet News Telugu

తమిళ హీరో బాడీ లాంగ్వేజ్ ని స్టడీ చేస్తున్న బన్ని

సినిమాలో చేసే పాత్ర కలకాలం ప్రేక్షకుడు మదిలో గుర్తిండిపోవాలంటే కాస్తంత హోమ్ వర్క్ అవసరం. అంతేకానీ అప్పటికప్పుడు ఏదో బస్ ఎక్కినట్లు పాత్రలోకి ఎక్కేస్తే...సీన్ నిలబడదు..సినిమా ఎక్కడా కనపడదు. 

Allu Arjun to Study  Karthis Body Language
Author
Hyderabad, First Published Mar 1, 2020, 2:30 PM IST

సినిమాలో చేసే పాత్ర కలకాలం ప్రేక్షకుడు మదిలో గుర్తిండిపోవాలంటే కాస్తంత హోమ్ వర్క్ అవసరం. అంతేకానీ అప్పటికప్పుడు ఏదో బస్ ఎక్కినట్లు పాత్రలోకి ఎక్కేస్తే...సీన్ నిలబడదు..సినిమా ఎక్కడా కనపడదు. ఆ విషయం ఈ జనరేషన్ హీరోలకు బాగా తెలుసు. అందుకే సినిమా చేసేటప్పుడు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటానికి తగిన సరంజామాని ఎంచుకుంటున్నారు. తాజాగా బన్ని సైతం తను చేయబోయే చిత్రం కోసం అటువంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

వివరాల్లోకి వెళితే... త్రివిక్రమ్ తో చేసిన ‘అల.. వైకుంఠపురములో’ ఘన విజయంతో అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా తదుపరి ప్రాజెక్టుపై ఎక్సెపెక్టేషన్స్ పెంచేయబోతోంది. అందుకే ప్రతీ విషయంలోనూ బన్నికి, సుకుమార్ చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు.  ఈ సినిమాని రంగస్దలం తరహాలో చాలా న్యాచురల్ గా ఉండేటట్లు, రా గా తీయాలని ఫిక్సయ్యారు సుకుమార్. దాంతో అల్లు అర్జున్ తను నెక్ట్స్ సినిమాలో చేయబోయే పాత్ర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం.శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఈ లారీ డ్రైవర్ పాత్ర కోసం కొన్ని రజనీకాంత్ పాత చిత్రాలతో పాటు, రీసెంట్ గా వచ్చిన కార్తీ ..ఖైదీ సినిమాని సైతం చూసారట బన్ని. అందులో హీరో బాడీ లాంగ్వేజ్ ని ఎలా ఉందో అని అబ్జర్వ్ చేస్తున్నార్ట. అంతేకాదు సినిమాటెక్ ఆ  పాత్ర ఫెరఫెక్ట్ గా ఉండేందుకు కార్తీ ఏం జాగ్రత్తలు తీసుకున్నాడో కనుక్కుని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు.

అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ..చిత్తూరు జిల్లా స్లాంగ్ లో మాట్లాడబోతున్నారు. అందుకోసం తన ఆఫీస్ లోనే చిత్తూరు జిల్లా స్లాంగ్ నిమిత్తం కొంతమందిని పిలిపించుకుని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చిత్తూరు ఏరియా నుంచి వచ్చి ఆర్టిస్ట్ లు కొందరు ఇందుకు సహకరిస్తున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని పడిగట్టు పదాలను ఈ సినిమాలో వాడనున్నారు. అచ్చం చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చిన వాడిలా అనిపించాలని, అది కూడా డ్రైవర్ పాత్ర కాబట్టి కాస్త మాస్ లాంగ్వేజ్ ఉండాలని శ్రమిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ పిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఫిబ్రవరినుంచి రెగ్యులర్‌గా జరిగే ఈ షెడ్యూల్‌లోనే బన్ని పాల్గొననున్నాడు. 2020 ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది. మైత్రీ మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భారి బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా టైటిల్‌పై సుకుమార్‌తో సహా చిత్ర యూనిట్‌ తెగ తర్జనభర్జన పడుతోందట. అయితే ఈ కథ ప్రధానంగా శేషాచలం అడువుల చుట్టూ సాగుతుండటంతో ‘శేషాచలం’అనే టైటిల్‌ సరిగ్గా ఆప్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే ఈ టైటిల్ కాకుండా మరి నాలుగైదు టైటిల్స్ అనుకుని అప్పుడు ఫైనలైజ్ చేద్దామని అల్లు అర్జున్ చెప్పారట.  

Follow Us:
Download App:
  • android
  • ios