Asianet News TeluguAsianet News Telugu

బన్నీ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్.. సుకుమార్ స్పెషల్ ట్రీట్మెంట్!

లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సినిమాతో మునుపెన్నడు లేని విధంగా సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

allu arjun sukumar movie latest update
Author
Hyderabad, First Published Feb 21, 2020, 2:14 PM IST

సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'అల.. వైకుంఠపురములో' సినిమాతో మునుపెన్నడు లేని విధంగా సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఆ సినిమా రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోది.

ఇటీవల 'అల..వైకుంఠపురములో' ప్రమోషన్స్ కారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన బన్నీ నెక్స్ట్ ఎలాంటి గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమాని పూర్తి చేయనున్నాడు.సినిమాలో చాలా వరకు దర్శకుడు కొత్త నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాచారం. సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర సింపుల్ గా కనిపిస్తూనే స్పెషల్ థ్రిల్ ని కలిస్తుందట.  ఇక సినిమాలో విలన్ కి తగ్గట్టుగా హీరో పాత్రను కూడా స్పెషల్ గా డిజైన్ చేశారట సుకుమార్. విజయ్ సేతుపతి టాలెంట్ యాక్టర్ ని మించి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఆ విషయంలో బన్నీకి ఒక ఐడియా ఉన్నప్పటికీ అభిమానుల్లో అంచనాల డోస్ ఆకాశాన్ని దాటుతుంది. అందుకే సుకుమార్ ఈ విషయంలో స్క్రీన్ ప్లే కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడట.  అలాగే బన్నీ పాత్ర కూడా చాలా నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తుందట. విలన్ ని కంటే రాక్షసత్వంగా ఆలోచిస్తాడని అదే సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. సినిమాలో నటీనటులు చాలా వరకు కొత్త నటీనటులే కనిపిస్తారని సమాచారం. ఎందుకంటె కథలో ఒక కొత్త తరహా ప్రాంతాన్ని చూపించాలని అనుకుంటున్న సుకుమార్ అందులో కొత్తవారు ఉంటేనే ఫ్రెష్ ఫీల్ వస్తుందని డిసైడ్ అయ్యారట.

ఇకపోతే విలన్ రోల్ కోసం విజయ్ రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి - బన్నీ ల మధ్య భారీ ఫైట్స్ ఉంటాయట. దాదాపు 10కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు కోలీవుడ్ హీరో ఇళయదళపతి విజయ్ 'మాస్టర్' లో కూడా ఈ విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios