సాధారణంగా కొత్త దర్శకులతో టెస్ట్ షూట్స్ చేస్తుంటారు. కానీ చాలా సినిమాలు తీసి హిట్స్ అందుకున్న సుకుమార్ కూడా తన కొత్త సినిమా కోసం టెస్ట్ చేస్తున్నాడంటే నమ్మగలరా..? కానీ అది నిజమట.

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అటవీ నేపధ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా అంతటినీ దట్టమైన అడవుల మధ్య షూటింగ్ చేయాలి. మిగిలిన చోట్ల షూటింగ్ చేయడం కంటే చాలా కష్టంతో కూడుకున్న పని.

ముఖ్యంగా కెమెరా లైటింగ్, కెమెరా ఎక్విప్మెంట్ సెట్ చేసుకోవడం లాంటివి బాగా కష్టం. వాటికే టైం మొత్తం సరిపోతుంది. అందుకే అసలు షూటింగ్ మొదలయ్యేలోపు ఒక ట్రయల్ షూట్ చేసుకొని వచ్చారు. ఈ సలహా అల్లు అర్జున్ ఇచ్చారట. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలనేది అల్లు అర్జున్ ప్లాన్.

దానికోసం షూటింగ్ గ్యాప్ లేకుండా జరగాలి. కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తున్నాడు. సుకుమార్ కి ఇలా డెడ్ లైన్స్ పెట్టుకొని పని చేయడం నచ్చదు కానీ నిర్మాతలు కూడా దసరాకి కావాలని అడుగుతుండడంతో తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.