Asianet News TeluguAsianet News Telugu

ప్రాక్టీస్ ఆగిపోయిందే, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎలా!

అల్లు అర్జున్ .. పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. పుష్పరాజ్ ఓ లారీ డ్రైవర్. అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్‌..ఈ సినిమా షూటింగ్ ను  లౌక్ డౌన్ ఎత్తేయగానే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో బాబీ సింహా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Allu Arjun Stop lorry driving classes
Author
Hyderabad, First Published May 2, 2020, 10:39 AM IST

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి ముత్తం శెట్టి మీడియా సహ నిర్మాత. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాయలసీమ యాస మాట్లాడే పుష్పరాజ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ఇప్పుడు రష్మికా మందన్నా కూడా ఆ యాసపై పట్టు సాధించేందుకు హోమ్‌ వర్క్‌ చేస్తున్నారని తెలిసింది. అదే సమయంలో అల్లు అర్జున్ ..పుష్పరాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. పుష్పరాజ్ ఓ లారీ డ్రైవర్. అడవుల్లో డ్రైవింగ్‌ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అర్జున్‌. 

ఈ సినిమా షూటింగ్ ను  లౌక్ డౌన్ ఎత్తేయగానే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో ప్రారంభించాలనుకుంటున్నారట. అక్కడ అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్‌ చేశారట. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పాత్రలో అల్లు అర్జున్, ఫారెస్ట్‌ అధికారి పాత్రలో బాబీ సింహా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

దాంతో లారీ డ్రైవర్ పాత్రకు గానూ...బన్నీ గత కొద్ది వారాలుగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. అయితే లాక్ డౌన్ దెబ్బతో ఆ ప్రాక్టీస్ మూల పడింది. నాచురల్ గా ఉండేందుకు బన్నీ ఇలా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇందుకోసం ఇద్దరు అనుభవం ఉన్న డ్రైవర్స్ ని, ఓ లారీని హైర్ చేసారని చెప్పుతున్నారు. మరి లాక్ డౌన్ ఎత్తేసాక మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభిస్తారా లేక ...నేర్చుకున్నది చాల్లే అని ముందుకు షూటింగ్ వెళ్తారా అని వేచి చూడాల్సిన అంశం. 

 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ, సీఈఓ: చెర్రీ.

Follow Us:
Download App:
  • android
  • ios