Asianet News TeluguAsianet News Telugu

బన్నీ తెలివైనోడు..పెద్ద డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు

కథ చెప్పన విధానం, దర్శకుడు స్టామినాతో చాలా వరకూ ప్రాజెక్టులు ఓకే అయ్యిపోతూంటాయి. ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యాక...ఇదేంటిది ఈ స్క్రిప్టుని నేనే ఓకే చేసేనా అనే డౌట్ వచ్చినా చేసేదేమో ఉండదు. సైలెంట్ గా షూట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే షూటింగ్ టైమ్ లో పెదవి విప్పితే ఆ ప్రాజెక్టు అక్కడితో మటాష్ అయ్యిపోతుంది. 

 

Allu Arjun rejcet  Big Disaster movie Disco Raja!
Author
Hyderabad, First Published Mar 4, 2020, 8:12 AM IST

కథ చెప్పన విధానం, దర్శకుడు స్టామినాతో చాలా వరకూ ప్రాజెక్టులు ఓకే అయ్యిపోతూంటాయి. ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యాక...ఇదేంటిది ఈ స్క్రిప్టుని నేనే ఓకే చేసేనా అనే డౌట్ వచ్చినా చేసేదేమో ఉండదు. సైలెంట్ గా షూట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే షూటింగ్ టైమ్ లో పెదవి విప్పితే ఆ ప్రాజెక్టు అక్కడితో మటాష్ అయ్యిపోతుంది.

అందుకే స్టార్ హీరోలు తమ దగ్గరకు వచ్చే కథలను తమ వాళ్లు నలుగురకు వినిపించి, తనకు బాగా క్లోజ్ అయిన వాళ్ల అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తూంటారు. అయితే ఒక్కోసారి అంచనాలు తప్పుతూంటాయి. ఓ పెద్ద బండరాయి లాంటి డిజాస్టర్ వచ్చి కెరీర్ పై పడిపోతుంది. నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ కు ఆ విషయం బాగా అర్దమైంది.  అవును...అల్లు అర్జున్ తను తీసుకునే నిర్ణయాలు చాలా వరకూ ఆచి,తూచి ,ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకుంటూంటాడు. అందుకేనేమో అలవైకుంఠపురంలో..వంటి సూపర్ హిట్ ని ఈ సంక్రాంతికి తెచ్చుకోగలిగాడు.

ఓ మేజర్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటారా... ఆ మధ్యన తన సోదరుడు అల్లు శిరీష్ తో చేసిన ఒక్క క్షణం షూటింగ్ సమయంలో ...దర్శకుడు విఐ ఆనంద్...అల్లు అర్జున్ కు ఓ స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేసాడట.  అది చాలా కమర్షియల్ లైన్ అని బన్ని కూడా ఫీలయ్యాడట. ఆ సినిమా షూట్ జరుగుతున్నంత సమయంలో అప్పుడప్పుడూ ఆ కథ గురుంచి డిస్కస్ చేసేవారట. ఈ లోగా ఒక్క క్షణం ఢమాల్ అంది. అల్లు అర్జున్ కు డౌట్ వచ్చేసింది. తర్వాత చేద్దాం..చూద్దాం అని ఆ లైన్ ని ప్రక్కన పెట్టేసాడు.

దాంతో విఐ ఆనంద్ ..ఆ కథను పట్టుకుని రవితేజను కలిసి ఓకే చేయించుకున్నాడు. అది మరేదో కాదు డిస్కో రాజా.  డిస్కోరాజా చిత్రం రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్. ఆరు కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఇంత పెద్ద లాస్ ప్రాజెక్టు రవితేజ కెరీర్ లో లేదని చెప్తున్నారు. అలా డిస్కోరాజా నుంచి అల్లు అర్జున్ తప్పించుకోగలిగాడు. లేకపోతే అల వైకుంఠపురములో స్దానంలో ఆ సినిమా రావాల్సి ఉంది. దాన్నే కొందరు తెలివి అంటే మరికొంతమంది టైమ్ అంటారు. ఏదేమైనా సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకోవటమే ఇండస్ట్రీలో హిట్, ప్లాఫ్ లను డిసైడ్ చేస్తుంది. ఏమంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios