టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ నాగ చైతన్యతో కలిసి ఫుల్ సినిమాలో అల్లరి చేయనున్నాడు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో గట్టిగానే ఉన్నాయట. అన్నిటికి మించి ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ని థియేటర్ కి మళ్ళీ మళ్ళీ రప్పిస్తామని దర్శకుడు బాబీ చెబుతున్నాడు.

సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందే సినిమా ఫిల్మ్ నగర్ లో పాజిటివ్ టాక్ ని అందుకుంటోంది. సినిమాను వీక్షించిన కొంతమంది నిర్మాతలు దర్శకుడిపై కన్నేసినట్లు తెలుస్తోంది. అల్లు కాంపౌండ్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ కూడా అందినట్లు సమాచారం.

అంటే నెక్స్ట్ అల్లూరి అర్జున్ తో వర్క్ చేసేందుకు దర్శకుడు బాబీ సిద్దమవుతున్నాడట. ప్రస్తుతం వెంకీమామ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ త్వరలోనే బన్నీని కలిసి ఒక యాక్షన్ థ్రిల్లర్ స్టోరీని చెప్పనున్నాడట.  ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎండ్ కాగానే సుకుమార్ సినిమాతో బిజీ కానున్నాడు.

ఆ తరువాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పట్టికి మళ్ళీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వస్తుందా లేదా అనేది షూటింగ్ మొదలయ్యే వరకు తెలియదు. కుదిరితే సుకుమార్ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే బాబీ కథను మొదలుపెట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ వేసుకున్నట్లు కూడా టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.