2018లో నా పేరు సూర్య సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన రిలీజ్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్న బన్నీ వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా స్టార్ చేయాలనీ చూస్తున్నాడు.

ఇప్పటికే సుకుమార్ సినిమాని లైన్ లో పెట్టిన సరైనోడు నెక్స్ట్ మరో టాలెంటెడ్ దర్శకుడి సినిమాను కూడా సెట్స్ పైకి తేవడానికి కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అసలైతే అల్లు అర్జున్ MCA దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని విధంగా ఆ ప్రాజెక్ట్ ని బన్నీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ సెట్స్ పైకి వస్తుందో లేదో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. దీంతో వేణు శ్రీరామ్ పవన్ సినిమాని డైరెక్ట్ చేయడానికి సిద్దమయ్యాడు.

ఇక ఇటీవల కొంతమంది దర్శకులతో చర్చలు జరిపిన బన్నీ డైరెక్టర్స్ చెప్పిన కథలను విన్నాడట. అందులో ఒక రెండు కథలు బన్నీకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే దర్శకులు ఎవరనే విషయాన్నీ బన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నాడు. అన్ని సెట్టయితేనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ అనంతరం సుకుమార్ ప్రాజెక్ట్ తో పాటు మరో డిఫరెంట్ సినిమాని బన్నీ వెంటనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం.