ఆర్య కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియెన్స్ లో తెలియని ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. ఆర్య 3 అంటూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తారని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా ఉర మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ పై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరు ఎంచుకున్న కంటెంట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. శేషాచలం అదువులల్లో జరిగే స్మగ్లింగ్ కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ లో కథను అల్లినట్లు తెలుస్తోంది.

ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇటీవల మరొక టాక్ ఆడియెన్స్ కి మంచి కిక్కిస్తోంది. బన్నీ మునుపెన్నడు చూడని విదంగా ఊర మాస్ లుక్ లో దర్శనమిస్తాడట. ఒక లారీ డ్రైవర్ పాత్ర కోసం బన్నీ తన లుక్ మొత్తం మార్చినట్లు టాక్. సాధారణంగా బన్నీ స్టయిలిష్ డ్రెస్సులతో ఒక లవర్ బాయ్ లా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ సుకుమార్ బన్నీ స్టైల్ ని మొత్తం మార్చేస్తున్నాడట. రంగస్థలం సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో చూపించాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు బన్నీ స్టైల్ కూడా చాలా వరకు మారబోతోందట. ఇటీవల తన బాడీ గార్డ్ బర్త్ డే పార్టీ సంబంధించిన ఫోటోలను చూస్తే.. బన్నీ మాస్ లుక్ రెడీ అయినట్లే తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. ఏప్రిల్ లో అనుకున్న షెడ్యూల్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సుకుమార్ మరో ప్లాన్ వేసుకుంటున్నారు. మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.