ఈ సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో సినిమాతో బరిలో దిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ఇండస్ట్రీ హిట్ తో ఆకట్టుకున్నాడు. గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావటంతో బన్నీ ఆ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ హిట్‌ తో సత్తా చాటాడు అల్లు అర్జున్‌. అదే జోరులో మరిన్ని సినిమాలు ఓకే చెపుతున్నాడు.

ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన బన్నీ ఆ సినిమా లో డిఫరెంట్ లుక్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటించనుంది. ఈ మూవీ గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నాడట. 

ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా ఐకాన్ అనే సినిమాను ప్రకటించాడు బన్నీ. తాజాగా మరో సినిమాకు సంబంధించిన వార్త కూడా వినిపిస్తోంది. గతంలో బన్నీ హీరోగా రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాను అందించిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతా లో వేసుకున్న సూరి, బన్నీ కోసం పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌ మరోసారి రేసుగుర్రం మ్యాజిక్‌ ను రిపీట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.