చాలా సార్లు డైరక్టర్ కో ఛాయిస్, హీరో కో ఛాయిస్ ఉంటూంటాయి. అయితే అవన్నీ క్రియేటివ్ డిఫరెన్స్ లు అనలేం. అభిప్రాయ భేధాలు అనాలి. కాకపోతే హీరో దే ఫైనల్ కాబట్టి...అతని అభిప్రాయమే జనామోదం అవుతుంది. డైరక్టర్ కు ఆ తర్వాత కాలంలో నచ్చేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్, బన్ని మధ్య అలాంటి అభిప్రాయ భేధం ఒకటి రన్ అవుతోందట.

అదీ ఓ ఐటం సాంగ్ లో నటించే స్టార్ విషయంలో అని తెలుస్తోంది. సాంగ్ బాగా వచ్చిందని, సినిమాలో హైలెట్ గా నిలవాలి కాబట్టి సరైన వాళ్లు ఆ సాంగ్ లో పడితే సినిమా ఒక్కసారిగా లేస్తుందని టీమ్ అంతా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారట. అయితే బన్నితో సమానంగా స్టెప్స్ వేయటమే కాకుండా అందాల విందు చేసే స్టార్ ఎవరేది మాత్రం తేలటం లేదట.

కెరీర్ పాడు చేసుకున్న ఇలియానా, బాలయ్య హీరోయిన్.. మరికొందరు హీరోయిన్ల రాంగ్ డెసిషన్!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రం ఈ హాట్ సాంగ్ లో అనసూయ కానీ రేష్మి గౌతమ్ ని కానీ పెడితే సరిపోతుంది. రెగ్యులర్ హీరోయిన్స్ ని చూసి జనాలకి మొహం మొత్తేసింది అనే అభిప్రాయంలో ఉన్నారట. అయితే అల్లు అర్జున్ మాత్రం తనతో డాన్స్ చేసే వాళ్లు స్టార్ హీరోయిన్ అయితే ఆ పాటకు నిండుతనం వస్తుందని, కాజల్ అగర్వాల్ అయితే బెస్ట్ అని అంటున్నారట.

నిర్మాతలు మాత్రం కాజల్ కన్నా అనసూయకు అయితే రెమ్యునేషన్ కూడా తక్కువ , రంగమ్మత్తగా ఆమెకు జనాల్లో క్రేజ్ ఉంది కాబట్టి క్లిక్ అవుతుందని అంటున్నారట. అయితే అల్లు అర్జున్ మాత్రం ఎన్ని చెప్పినా కాజల్ వైపే మొగ్గు చూపుతూండటంతో తప్పేటట్లు లేదు అంటున్నారు. త్రివిక్రమ్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసినా ..మీ ఇష్టం..అలాంటి పాటకు కాజల్ లాంటి స్టార్ ఉంటేనే బాగుంటుందని బన్ని  తేల్చి చెప్పారట.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో.  బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌ కీలక ప్రాతలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. ఇప్పటివరకు విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా, ఓ మై గాడ్‌.. డాడీ’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.