అందరికి అభిమానులు ఉంటారు. కానీ నాకు ఒక్కడికే ఆర్మీ ఉంది. అల్లు ఆర్మీ' అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో.. ఆడియో ఈవెంట్ లో గర్వంగా చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హార్డ్ కొర్ ఫ్యాన్ ని చూస్తే.. బన్నీ ఇంకేమంటాడో..? ఎందుకంటె.. ఈ కుర్రాడు బన్నీ పై ఉన్న అభిమానాన్ని తన ప్రపంచం నిండా నింపేశాడు. అల్లు అర్జున్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుజిత్ స్టయిలిష్ స్టార్ అంటే ఎనలేని అభిమానం.

గుండెల్లో నుంచి తన గది వరకు ఫొటోలతో అలంకరించుకొని స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. మెయిన్ గా గది నిండా అల్లు అర్జున్ కి సంబందించిన ఫొటోలు 50వేల వరకు ఉంటాయి.  ఇక వంటిపై 19 టాటూలు కూడా బన్నీవే. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫ్యాన్ ప్రేమకు బన్నీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానుంది.