‘అల.. వైకుంఠపురములో’ ఘన విజయంతో అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా తదుపరి ప్రాజెక్టుపై ఎక్సెపెక్టేషన్స్ పెంచేయబోతోంది. ఈ విషయం బన్నికి, సుకుమార్ కి తెలుసు. అందుకే ప్రతీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుని పట్టాలెక్కించబోతున్నారు.  ఈ సినిమాని రంగస్దలం తరహాలో చాలా న్యాచురల్ గా ఉండేటట్లు, రా గా తీయాలని ఫిక్సయ్యారు సుకుమార్. దాంతో అల్లు అర్జున్ తను నెక్ట్స్ సినిమాలో చేయబోయే పాత్ర కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం.శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ..చిత్తూరు జిల్లా స్లాంగ్ లో మాట్లాడబోతున్నారు. అందుకోసం తన ఆఫీస్ లోనే చిత్తూరు జిల్లా స్లాంగ్ నిమిత్తం కొంతమందిని పిలిపించుకుని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చిత్తూరు ఏరియా నుంచి వచ్చి ఆర్టిస్ట్ లు కొందరు ఇందుకు సహకరిస్తున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని పడిగట్టు పదాలను ఈ సినిమాలో వాడనున్నారు. అచ్చం చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చిన వాడిలా అనిపించాలని, అది కూడా డ్రైవర్ పాత్ర కాబట్టి కాస్త మాస్ లాంగ్వేజ్ ఉండాలని శ్రమిస్తున్నారు.

అల్లు అర్జున్ ఫ్యామిలిలో విషాదం.. ఆయన మృతి, హుటాహుటిన విజయవాడకు..

ఇక ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ పిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఫిబ్రవరినుంచి రెగ్యులర్‌గా జరిగే ఈ షెడ్యూల్‌లోనే బన్ని పాల్గొననున్నాడు. 2020 ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది. మైత్రీ మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని భారి బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా టైటిల్‌పై సుకుమార్‌తో సహా చిత్ర యూనిట్‌ తెగ తర్జనభర్జన పడుతోందట. అయితే ఈ కథ ప్రధానంగా శేషాచలం అడువుల చుట్టూ సాగుతుండటంతో ‘శేషాచలం’అనే టైటిల్‌ సరిగ్గా ఆప్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే ఈ టైటిల్ కాకుండా మరి నాలుగైదు టైటిల్స్ అనుకుని అప్పుడు ఫైనలైజ్ చేద్దామని అల్లు అర్జున్ చెప్పారట.  

తివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ తో  హ్యాట్రిక్‌ కొట్టిన అల్లు అర్జున్‌.. ఈ చిత్రంతో సుకుమార్‌తోనూ హ్యాట్రిక్‌ కొట్టాలని బన్ని భావిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నెగటీవ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.