టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ అల.. వైకుంఠపురములో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఒక పాత్ర కోసం దర్శకుడి ఆలోచనకు మించి కష్టపడటం బన్నీకి అలవాటే.  

అలాగే ఈ సినిమాలో కూడా ఫిట్ నెస్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 4 నెలల్లో తీరిక లేకుండా రోజు 2 గంటల పాటు వర్కౌట్స్ చేశాడట. ట్రైనర్ సమక్షంలో రోజు రెండు గంటలపాటు వర్కౌట్స్ చేసి నాలుగు నెలల్లోనే 14 కిలోల బరువు తగ్గాడట. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించిననున్నట్లు తెలుస్తోంది.  

ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన సామజవరగమన సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూస్తుండగానే యూట్యూబ్ లో 20 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాల డోస్ ని పెంచేసింది.

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా ,నటిస్తుండగా టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.