టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన కొడుకు కూతురితో గడిపిన క్షణాలను నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా కూతురు అర్హ తో కలిసి చేసే అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినా కూతురి దగ్గర మాత్రం చిన్నపిల్లాడిలా మారిపోతాడు.

గతంలో బన్నీ చేసిన 'రాములో రాములా' స్టెప్ పై దోష స్టెప్ అంటూ సెటైర్ వేసిన గడుసు పిల్ల ఇప్పుడు ఏకంగా 'బే' అనేసింది. తన టీ షర్ట్ పై ఉన్న ఒక కలర్ నేమ్ చెప్పమని బన్నీ అడగ్గా.. పింక్ బే.. అంటూ అర్హ అల్లరి చేసింది. ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ,.. బే అనడం స్టార్ట్ చేసిన అర్హ ను బన్నీ గారాబంగా హద్దుకున్నాడు. ఇక నిమిషాల్లోనే ఆ వీడియో సోషల మీడియాలో వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on Mar 1, 2020 at 8:46am PST

ఇక ఇటీవల "అల.. వైకుంఠపురములో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో మరొక డిఫరెంట్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ మరొక రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.