స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో పాటలైతే ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పాల్సిందే. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ సాంగ్స్ యూట్యూబ్ లో సునామి సృష్టించాయి. 

ఇక బుట్టబొమ్మ సాంగ్ లో బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఇండియా మొత్తం వైరల్ అయ్యాయి. ఆ మాటకొస్తే వరల్డ్ వైడ్ గా కూడా బుట్ట బొమ్మ సాంగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, తన సతీమణితో కలసి బుట్ట బొమ్మ సాంగ్ కు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Our lil #buttabomma singing #buttabomma #quarantinefun

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on May 4, 2020 at 7:15am PDT

మంజు వారియర్, శిల్పా శెట్టి, దిశా పటాని లాంటి సెలెబ్రిటీలంతా బుట్టబొమ్మ సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. బుట్టబొమ్మ సాంగ్ ప్రస్తుతం ప్రకారం ప్రకంపనలు రేపుతోంది. తాజాగా బన్నీ ముద్దుల కుమార్తె అల్లు అర్హ కూడా బుట్టబొమ్మ సాంగ్ సునామీలో జాయిన్ అయింది. 

అల్లు అర్హ బుట్టబొమ్మ సాంగ్ ని ముద్దు ముద్దుగా పాడుతున్న వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.వాస్తవానికి అర్హ బుట్టబొమ్మ సాంగ్ ని పాడుతుండగా బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో వాయిస్ వినిపిస్తోంది. ఏఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది.