దిశ హత్యాచార ఘటన లో ఎవరు ఊహించని విధంగా పోలీసులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపేశారు. దిశను సజీవ దహనం చేసిన చోటే వారిని కూడా హతమార్చడంతో ఒక్కసారిగా దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇక సినీ తారలు కూడా ఘటనపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే మంచు మనోజ్, నాని, సమంతా వంటి తారలు కామెంట్ చేశారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యాయం జరిగింది అని బన్నీ ఒక స్పెషల్ ఫోటోని పోస్ట్ చేశారు. అలాగే బన్నీకి సంబందించిన ఒక మీమ్ కూడా వైరల్ అవుతోంది.

నిందితులకు ఆదివారం బిర్యానీ పెట్టడంతో ఒక్కసారిగా దేశమంతా అందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఇదే మీకు ఆఖరి బిర్యానీ అంటూ .. ఆ ఇన్సిడెంట్ కి సంబందించి మీమ్ వైరల్ అవుతోంది

.