Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ

బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' రికార్డుల మోత ఓ రేంజ్ లో వినపడింది. అయితే ఇప్పుడు ఆ డోస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తాకింది. ఇప్పట్లో బన్నీ మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - మరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు.

allu arjun another indian box office record
Author
Hyderabad, First Published Jan 29, 2020, 2:50 PM IST

మొన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' రికార్డుల మోత ఓ రేంజ్ లో వినపడింది. అయితే ఇప్పుడు ఆ డోస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తాకింది. ఇప్పట్లో బన్నీ మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - మరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు.

allu arjun another indian box office record

ఈ నెల 13న వరల్డ్ వైడ్ గా తెలుగు మలయాళం భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా అందుకొని ఒక రికార్డును ఈ సినిమా అందుకుంది. హిందీ లో రిలీజ్ కాకపోయిన్నప్పటికీ కేవలం ఇండియాలో అత్యంత వేగంగా 200కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

allu arjun another indian box office record

ఇక చిత్ర యూనిట్ అసలైన కలెక్షన్స్ చూపిస్తామని ఇటీవల ఇన్ డైరెక్ట్ గా ప్రత్యర్థి ఫ్యాన్స్ కి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో' సినిమాలకు సంబందించిన కలెక్షన్స్ వార్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి. టాలీవుడ్ లో మునుపెన్నడు లేని విధంగా అల్లు అర్జున్ చాలా స్పీడ్ గా 200ల కోట్ల వసూళ్లను అందుకోవడమే కాకుండా కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.

allu arjun another indian box office record

చాలా వరకు 'అల.. వైకుంఠపురములో'అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాలకంటే ఎక్కువగా యూఎస్ లో డాలర్స్ ని రాబడుతోంది. మెయిన్ గా థమన్ ఇచ్చిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఓపెనింగ్స్ తోనే సినిమా మంచి హైప్ క్రియేట్ చేసి డబుల్ సెంచరీతో దూసుకుపోతున్న బన్నీ ఇంకా ఎంతవరకు రాబడతాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios