టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' రికార్డుల మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ సినిమా ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక చిత్ర యూనిట్ అసలైన కలెక్షన్స్ చూపిస్తామని ఇటీవల ఇన్ డైరెక్ట్ గా ప్రత్యర్థి ఫ్యాన్స్ కి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో' సినిమాలకు సంబందించిన కలెక్షన్స్ వార్ ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ సినిమా 220కోట్లను (గ్రాస్) క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలో 112కోట్ల షేర్ వసూళ్లను సాధించిన అల.. వరల్డ్ వైడ్ గా 143కోట్ల షేర్స్ ని సాధించింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన కలెక్షన్స్ స్టాండర్డ్ గానే ఉన్నాయి.

టాలీవుడ్ లో మునుపెన్నడు లేని విధంగా అల్లు అర్జున్ చాలా స్పీడ్ గా 100కోట్ల వసూళ్లను అందుకోవడమే కాకుండా కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. చాలా వరకు 'అల.. వైకుంఠపురములో'అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాలకంటే ఎక్కువగా యూఎస్ లో డాలర్స్ ని రాబడుతోంది. మెయిన్ గా థమన్ ఇచ్చిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఓపెనింగ్స్ తోనే సినిమా మంచి హైప్ క్రియేట్ చేసి డబుల్ సెంచరీతో దూసుకుపోతున్న బన్నీ ఇంకా ఎంతవరకు రాబడతాడో చూడాలి.