మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబందించిన సాంగ్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో ట్రెండ్ సెట్ చేయగా ఇప్పుడు చిత్ర యూనిట్ మరింత బూస్ట్ ఇచ్చింది.

సామజవరాగమన.. సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ అల్లు వారి అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. స్టయిలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ తోనే కాకుండా కూల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందే పూజా హెగ్డే తో డీజే సినిమా చేసినప్పటికీ ఈ ఫ్రెమ్ లో మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నారు. చూస్తుంటే సినిమాలో ఈ సాంగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఫారిన్ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు తెలుగు పాటతో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. మరి సంక్రాంతికి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.