Asianet News TeluguAsianet News Telugu

దిల్ రాజుకు అరవింద్ అదిరిపోయే ఆఫర్?

వరసపెట్టి ప్రతీ శుక్రవారం చిన్నో, పెద్దో ఏదో ఒకటి రిలీజ్ అవ్వటం ఆగింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అంతా తలక్రిందులైపోయింది.  ఇప్పటికీ థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో, జనం చూడటానికి వస్తారో లేదో క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో చాలా మంది తమ సినిమాలను ఓటీటిలకు ఇచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 'వి' సినిమా రిలీజ్ పరిస్దితి ఏమిటనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా చాలా మంది సినిమావాళ్ళకు డిస్కషన్ పాయింట్ గా మారింది.

Allu Aravinds offer for Dil Raju
Author
Hyderabad, First Published Jul 3, 2020, 8:32 AM IST

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కు మరో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. కరోనా వేళ ఆ ఆఫర్ ఏమై ఉంటుందని సినీ అభిమానులు ఆసక్తి చూపెడుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ తన ఓటీటి ప్లాట్ ఫామ్ ఆహా కు సంబందించిన డీల్ తో దిల్ రాజుని సంప్రదించారని, అది భారీ మొత్తం అని, అందుకు దిల్ రాజు ముందుకొచ్చి యస్ చెప్పే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే...దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం  "V" సినిమా ఓటీటి లో రిలీజ్ చేస్తారంటూ గత కొద్ది కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో మరో నాలుగైదు నెలలు  వెయిట్ చేసి థియేటర్లలో కాకుండా మా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేస్తే భారీ మొత్తం ఇస్తామని ఓటిటీ కంపెనులు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు అటు హీరో నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ  కుదరదన్నారు. కానీ వాళ్లు టెమ్టింగ్ ఆపర్ ఇచ్చారు.  కానీ ఎట్టి పరిస్థితిల్లోనూ సినిమాని ముందు థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు డిసైడ్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు థియోటర్స్ ద్వారా విడుదల చేయటం అనేది మరో ఆరు నెలలు దాకా ఉండదని అర్దమవుతోంది.

 కరోనా విజృంభణ ఇండియాలో బాగా పుంజుకుంది. ఈ నేపధ్యంలో చాలా సినిమాలు ఇక తప్పదు అన్నట్లు ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దాంతో అల్లు అరవింద్ తన ఆహా ఓటీటి ప్లాట్ ఫామ్ కోసం   "V" సినిమా ఇస్తారేమో అని దిల్ రాజుని కదిపారని వార్త. అందుకోసం దాదాపు ముప్పై కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు. నాని సినిమా కనుక  ఆహాకు వస్తే  ఒక్కసారిగా సబ్ స్కైబర్స్ పెరిగే అవకాసం ఉంది. అయితే దిల్ రాజు సైడ్ నుంచి ఇంకా యస్ లేదా నో అనేది ఇంకా రాలేదట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా కోసం పాతిక కోట్ల ఆఫర్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. 

దాంతో  మిగతా నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు దిల్ రాజు నిర్ణయం వైపే చూస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే దిల్ రాజు వంటి నిర్మాత తీసుకునే నిర్ణయం ఇండస్ట్రీపై ఎక్కువగా ఉంటుంది. ఆయన కనుక ఈ సినిమాని ఓటీటికి ఇఛ్చేసి ఉంటే మిగతా నిర్మాతలు కూడా  అదే దారిలో ప్రయాణం పెట్టుకునే అవకాసం ఉంది.  
 
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'వి' . ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో నాని తో పాటు హీరో సుదీర్ బాబు కూడా నటిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న...ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటిస్తున్న సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios