తెలుగులో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’..ఇప్పుడు తమిళంలోనూ  లాంచ్ అయ్యింది. ఇటీవల చైన్నైలో దీని లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చైన్నైతో తనకున్న సంబంధాన్ని తెలిపారు. 

స్మాల్ బడ్జెట్ సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు ప్రాధాన్యతనిస్తున్నాయి. అటు థియేటర్లలో రిలీజ్ చేసినప్పటికీ ఓటీటీ (OTT) సంస్థలకు తమ సినిమా డిజిటల్ రైట్స్ ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఏ ఇండస్ట్రీలోనైనా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా కొనసాగుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చిన్న చిత్రాలకు ఆశాజనకంగా మారుతున్నాయి. ఆ విధంగా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సూపర్‌ రేటింగ్‌తో దూసుకుపోతోంది. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేస్తూ ప్రైక్షకులకు ఓటీటీవైపు ఆకర్షిస్తున్నారు. 

‘ఆహా’(Aha) అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆహాను తమిళంలోనూ ప్రారంభించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఆడంబరంగా జరిగిన ఈ వేడుకకు నిర్మాత ఆర్‌.బి.చౌదరి, కలైపులి ఎస్‌.థాను, దర్శకుడు కె ఎస్‌ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ దంపతులు, నటుడు ఎస్‌.జె.సూర్య, ఖుష్భు, కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ పాల్గొన్నారు. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ను నిర్మాత కలైపులి ఎస్‌.థాను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తమిళ నటుడు జయం రవి (Jayam Ravi), సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh) ‘ఆహా’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం వైదికపై అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఆహా ద్వారా వందశాతం ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామని తమిళ ఆడియెన్స్ కు హామీనిచ్చారు. ఆయన చెన్నైలోనే పుట్టి పెరిగినట్టు తెలిపారు. విద్యాభ్యాసం కూడా చైన్నైలోనే పూర్తయిందని అప్పటి రోజులను గుర్తు చేసుకుని కొంత ఎమోషనల్ అయ్యారు.

20 ఏళ్ల కింద చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ ఇప్పుడు తిరిగి రావడం సంతోషంగా ఉందనన్నారు. పుట్టింటికి వచ్చినంత ఆనందం కలుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆహా కొత్త కొత్త సినిమాలను చేజిక్కించుకుంటూ.. మరోవైపు టాక్ షోతోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలి నందమూరి నటసింహం బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో ఆహా రేటింగ్ మరింతగా దూసుకెళ్లింది. ఇప్పుడు తమిళంలోనూ లాంచ్ కావడంతో ఊహించని ఫలితాలను ‘ఆహా’ అందుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే తమిళ నటుడు కార్తీ నటించిన ‘సర్దార్’ తమిళం మూవీ డిజిటల్ రైట్స్ ను కూడా ‘ఆహా’ దక్కించుకుంది. మరోవైపు తమిళంలోనూ ఆహాను లాంచ్ చేయడం పట్ల ‘కార్తీ’ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆహా ఓటీటీ తమిళ్ కు స్వాగతం పలికారు.