ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కి 1974లో నిర్మలతో వివాహం జరిగింది. అయితే వారి కాపురంలో తన తండ్రి అల్లు రామలింగయ్య పుల్లలు పెట్టేవారని అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించాడు. మొదట నిర్మలను తన తండ్రి అల్లు రామలింగయ్య పెళ్లిచూపులు చూసి వచ్చారని.. ఆయన ఓకే చెప్పడంతో తను చూపులకు వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు.

నిశ్చితార్ధం జరిగిన ఐదు నెలల గ్యాప్ లో పెళ్లి చేసుకున్నట్లు అరవింద్, నిర్మల దంపతులు పాతరోజులను గుర్తు చేసుకున్నారు. అత్త మామలు తనను కూతురిలా చూసుకున్నారని.. నిర్మల చెప్పుకొచ్చారు. తనను మావయ్య 'అమ్మాయ్' అని పిలిచేవారని.. మామ గారు షూటింగ్ నుండి వచ్చిన తరువాత ఎన్నో విషయాలను తనతో పంచుకునేవారని తెలిపారు.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

అదే సమయంలో తనపై చాడీలు కూడా చెప్పేవారని అల్లు అరవింద్ కల్పించుకొని సరదాగా మాట్లాడారు. నిర్మల ముందు తనను తిడుతూ తన కాపురంలో పుల్లలు పెట్టేవారంటూ నవ్వుతూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. 'ఆల‌స్యంగా వ‌స్తున్నాడంటే వాడికేదో ప‌ని ఉంద‌ని కాదు. నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా చెప్పేవారు' అని నిర్మ‌ల మ‌రిన్నివిష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు.

అల్లు అరవింద్ 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంపదెబ్బలు కూడా తిన్నారట. దానికి కారణమేంటంటే.. ఓ సందర్భంలో కారుని వేగంగా నడుపుతూ బ్రేక్ వేయడంతో నాన్నవిండ్ షీల్డ్ కి కొట్టుకోబోయారని.. ఆ కోపంతో తన చెంపపై కొట్టారని చెబుతూ అరవింద్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.