అల్లు అరవింద్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. అరవింద్ కు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ముగ్గురు తనయులు. అల్లు అర్జున్, శిరీష్ ఇద్దరూ నటులుగా రాణిస్తున్నారు. బాబీ ఇప్పుడిప్పుడే నిర్మాతగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 

ఒకప్పుడు వేగంగా సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్ ప్రస్తుతం వేగం తగ్గించారు. తెరవెనుక ఉండి మాత్రమే తన తనయుల సినిమాల పనులు చూసుకుంటున్నారు. ఇటీవల అల్లు అరవింద్ 70 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇకపై అన్ని పనులని తనయులు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని అరవింద్ భావిస్తున్నారట. 

దీని కోసం అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు తనయులకు అరవింద్ ఆస్తి పంపకాలు చేపట్టారట. దీనికి సంబందించిన వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా అల్లు ఫ్యామిలీకి తలమానికంగా ఉన్న గీతా ఆర్ట్స్ సంస్థ అరవింద్ పెద్ద కుమారుడు బాబీ చేతుల్లోకి వెళ్లినట్లు టాక్. 

ఇటీవల బాబీ వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ ప్రజెంటర్. గీత ఆర్ట్స్ 2 సంస్థలో బన్నీ సన్నిహితుడు బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తున్నాడు. 

అల్లు అర్జున్ త్వరలో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అల్లు అరవింద్ ఫ్యామిలిలో ఆస్తి పంపకాల వార్త మాత్రం సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

అల్లు శిరీష్ ఇప్పటికి తన సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. మొత్తంగా అరవింద్ ముగ్గురు వారసులు చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు. అల్లు అర్జున్ నుంచి త్వరలో రాబోతున్న చిత్రం అల.. వైకుంఠ పురములో. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.