మలయాళం సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో మమ్ముంటి నుంచి మొదటిసారి భారీ స్థాయిలో హిస్టారికల్ మూవీ రాబోతోంది. పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా మమాంగం. ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మమ్ముంటి గతంలో ఇచ్చిన ఒక ఆన్సర్ గురించి అల్లు అరవింద్ వివరా ఇచ్చారు. 12 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర చేయగలరా అని అడిగితే.. ఇదే మాట చిరంజీవిని అడగగలరా అని సమాధానం చెప్పారు. అప్పుడే ఆయన నిర్మలమైన వ్యక్తిత్వం గురించి అర్థమైందని అన్నారు.  

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. కేరళలోని చావెరుక్కల్‌ యుద్ధ వీరులకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అలాంటి కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వీరుల కథతో మమ్ముట్టి ప్రేక్షకుల ముందుకు రావడం అభినందనీయం’’ అన్నారు. ఇక మమ్ముంటి కూడా మెగా ఫ్యామిలీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అల్లు అరవింద్ గారు సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

ఇక మమాంగం సినిమాను మళయాళంతో పాటు తమిళ్ తెలుగు హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వం వహించాడు. మొదటి షెడ్యూల్ కి వేరే దర్శకుడు దర్శకత్వం వహించగా అనుకోని విధంగా మధ్యలో ఈ ప్రాజెక్ట్ ని పద్మకుమార్ టేకప్ చేశారు. ఇక విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.