టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా అల్లరి నరేష్ సినిమా వస్తోంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమ కోసం ఎంతో ఎదురుచూసేవారు. అయితే ఇదంతా ఐదేళ్ల క్రితం వరకే నడిచింది. ఒకప్పుడు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సినిమాలు రిలీజ్ చేయడం తగ్గించేశాడు. మినిమమ్ గ్యారెంటీ హిట్ తో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద హడావుడి చేసిన నరేష్ వరుస అపజయాలతో డల్లయ్యాడు.

ఇకపోతే నెక్స్ట్ ఎలాగైనా మరో సక్సెస్ తో నిలదొక్కుకోవాలని రూటు మార్చాడు. ఆడియెన్స్ టెస్ట్ మారిందని థ్రిల్లర్ జానర్ లో థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు. రీసెంట్ గా తన కొత్త సినిమాకు సంబందించిన ఒక లుక్ ని రిలీజ్ చేశాడు.  ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ లో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నసరికొత్త చిత్రంలో నరేష్ ఒక విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. అల్లరిగా కామెడీ గా కనిపించే నరేష్ ఈ సారి సీరియస్ లుక్ తో దర్శనమిచ్చాడు,

ఈ సినిమాని సతీష్ వేగేశ్న నిర్మస్తున్నారు. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో సినిమాను లాంచ్ చేయనున్నారు. మరీ ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.   ఇకపోతే మహర్షిలో నరేష్ పాత్ర అంతగా క్లిక్కవ్వలేదనే చెప్పాలి. సినిమా కూడా అనుకున్నంతగా ప్రాఫిట్స్ ని అందించలేకపోయింది. గతంలో నరేష్ గమ్యం సినిమాలో చేసిన గాలి శీను రోల్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

నరేష్ కెరీర్ లోనే ఆ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. కానీ మహర్షిలో చేసిన రవి శంకర్ పాత్ర మాత్రం గమ్యం స్థాయిలో క్రేజ్ తేలేకపోయింది. ఇక ఇటీవల రెండు పెద్ద సినిమాల్లో కీ రోల్స్ వచ్చినప్పటికి నరేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. తన అసలైన హీరో ట్రాక్ సక్సెస్ రూట్ లోకి వచ్చే వరకు ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని నరేష్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట.