టాలీవుడ్ లో హిట్టుకోసం ఎదురుచూస్తున్న కుర్రహీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అల్లరి నరేష్ ముందున్నాడనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్టందుకున్న నరేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక మొత్తానికి కామెడీ వర్కౌట్ కావడం లేదని తన రూటు మార్చాడు.

ఆడియెన్స్ టెస్ట్ మారిందని థ్రిల్లర్ జానర్ లో థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు. రీసెంట్ గా తన కొత్త సినిమాకు సంబందించిన ఒక షాకింగ్  లుక్ ని రిలీజ్ చేశాడు. నాంది అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో నరేష్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అర్ధమవుతోంది. గొలుసులతో కట్టేసిన ఒక బానిస లాంటి మనిషి తిరగబడినట్లుగా సీరియస్ ఫీల్ ని.. ఈ పోస్టర్ కలిగిస్తోంది.   ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ లో దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నసరికొత్త చిత్రంలో నరేష్ ఒక విభిన్న పాత్రలో నటిస్తున్నాడు.

అల్లరిగా కామెడీ గా కనిపించే నరేష్ ఈ సారి సీరియస్ లుక్ తో దర్శనమిచ్చాడు,. ఈ సినిమాని సతీష్ వేగేశ్న నిర్మస్తున్నారు. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో సినిమాను లాంచ్ చేయనున్నారు. మరీ ఈ సినిమాతో అల్లరి నరేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.  ఇకపోతే మహర్షిలో నరేష్ పాత్ర అంతగా క్లిక్కవ్వలేదనే చెప్పాలి.

సినిమా కూడా అనుకున్నంతగా ప్రాఫిట్స్ ని అందించలేకపోయింది. గతంలో నరేష్ గమ్యం సినిమాలో చేసిన గాలి శీను రోల్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. నరేష్ కెరీర్ లోనే ఆ సినిమా బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. కానీ మహర్షిలో చేసిన రవి శంకర్ పాత్ర మాత్రం గమ్యం స్థాయిలో క్రేజ్ తేలేకపోయింది. ఇక ఇప్పుడు 'నాంది' సినిమాతో క్లిక్కవ్వాలని నరేష్ ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాడు.