ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్ అందుకున్న హీరోల్లో నరేష్ ఒకరు. నరేష్ ఎలాంటి సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకొని నిర్మాతలకు మంచి లాభాల్ని అందించేవి. కానీ ఇటీవల కాలంలో చాలా వరకు ఆడియెన్స్ రొటీన్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నరేష్ కామెడీ సినిమాలకి కూడా కూడా ఆదరణ తగ్గిపోయింది. 

వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. అనుకోకుండా మహేష్ బాబు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ కావడంతో నరేష్ కి కాస్త గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు తన రెగ్యులర్ట్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా కొత్త దర్శకుడు చెప్పిన కథకు నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

భలే భలే మగాడివోయ్ కథను రిజెక్ట్ చేయలేదు.. కానీ: నరేష్ 

విజయ్ కనక మేడల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ కొత్త సినిమాలో నరేష్ రెండు దైఫరెంట్ గెటప్స్ లలో కనిపించబోతున్నాడు. మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ మూవీ `బంగారు బుల్లోడు` సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.  న‌రేశ్ న‌టించ‌బోయే కొత్త కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.