ఈసారి రెట్టింపు మాస్ ,రెట్టింపు వినోదాన్ని ఇవ్వబోతుందని చెబుతోంది యూనిట్. పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను రాశాడట
సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram pothineni) హీరోగా వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar). ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఊరమాస్ కాంబో మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ చేయనున్నట్లు పూరీ ప్రకటించారు. ఈ సినిమాకు ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇప్పటికే ఈ సీక్వెల్ చిత్రం స్క్రిప్టు పూర్తై ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జూలై రెండవ వారంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. లైగర్ డిజాస్టర్ నుంచి పూర్తి స్దాయిలో బయటపడేలా ఈ ప్రాజెక్టు చేయాలని ఛార్మి,పూరి భావిస్తున్నారట. దాంతో చిత్రం లావిష్ గా , యూత్ కు పట్టేలా పూరి ప్లాన్ చేసారట.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ ఆ సినిమాని మహా శివరాత్రి సందర్భంగా 2024, మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి చిత్రవర్గాలు. రి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. రెట్టింపు స్థాయిలో మాస్, వినోదంతోపాటు... అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు తెలిపాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. . పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగిన కథను రాశాడట. అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో హై బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందట.
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు, రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం నుంచి సోమవారం గ్లింప్స్ రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని రామ్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
