సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని ఎంక్వయిరీ చేయడానికి ముంబై వెళ్లిన బీహార్ క్యాడర్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ని బలవంతంగా క్వారంటైన్ కి తరలించిన ముంబై పోలీసుల వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారింది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై ఆయన తండ్రి కేకే సింగ్ అనుమానాలున్నాయని పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేయడానికి ముంబైకి వెళ్లిన ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ కుమార్ ని క్వారంటైన్ సెంటర్లోకి బలవంతంగా తరలించడం ఈ వివాదానికి కారణమయింది. 

సుశాంత్ మరణాన్ని సారైనా రీతిలో విచారించడంతో ముంబై పోలీసులు విఫలమయ్యారని, సుశాంత్ ధీ ఆత్మహత్యకాదు హత్యా అని రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు స్పందించారు. 

వినయ్ కుమార్ కి తాము ఐపీఎస్ అధికారులకు ఇచ్చే అన్ని వసతి సదుపాయాలను కల్పించామని, ఆయనకు ప్రోటోకాల్ ప్రకారంగా ఇచ్చే అన్ని వసతులను కల్పించామని, వాహనం, వసతి ఏర్పాట్లు చేశామని అన్నారు. 

బీహార్ పోలీసులు తమకు   ఏర్పాట్లన్నీ చేశామని ముంబై పోలీసులు బీహార్ పోలీసులకు కౌంటర్ ఇచ్చారు. 

ఇకపోతే.... చనిపోయే ముందు సుశాంత్‌ గూగుల్‌ సెర్చ్ చేశాడా? నొప్పి లేకుండా ఆత్మహత్య ఎలా చేసుకోవాలో గూగుల్‌లో వెతికి మరీ సూసైడ్‌ చేసుకున్నాడా? సుశాంత్‌ని హత్య కాదు, నిజంగానే ఆత్మహత్యా? అంటే అవుననే విషయాన్ని ముంబయి పోలీసులు వెల్లడిస్తున్నారు. తాజాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సెల్‌ఫోన్‌ని తనిఖీ చేయగా.. మరికొన్నికొత్త కోణాలు బయటపడ్డాయి. 

దీంతో సుశాంత్‌ డెత్‌ కేసు ఇప్పుడు మరో మలుపు తీసుకుంటుంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతా ఆత్మహత్యే అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్‌ది హత్యే అంటూ ఓ వీడియోలో అధారాలతో సహా వెల్లడించింది. 

దీంతో ఆయన కేసు మరో కీలక మలుపు తీసుకుందని అంతా అనుకున్నారు. ఇంతలోనే ముంబయి పోలీసులు మరో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, కీలక విషయాలను వెల్లడించారు.