ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్నతాజా చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు.  అలాగే 'ఆర్‌.ఆర్.ఆర్‌'లో చెర్రీ సతీమణిగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసారు. పూణే షెడ్యూల్ లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. అలియా భట్ ఇంత వరకు ఒక్కరోజు కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. 

ఇప్పుడు రాజమౌళి టెస్ట్ షూట్ చేసి మళ్లీ సినిమాని పట్టాలు ఎక్కించటానికి సిద్దపడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ ఊహించని ట్విస్ట్ ఎదురైందని సినీ వర్గాల్లో వినపడుతోంది. అలియా భట్ తాను కరోనా తగ్గేదాకా షూటింగ్ కు రాలేనని చెప్పినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు నిర్మాతలు ఆమెతో ఎలా డీల్ చేయాలో తెలియక తలపట్టుకున్నారట. తాను తీసుకోబోయో జాగ్రత్తలు వంటివి చెప్పి ఒప్పిద్దామనుకున్నా ఒప్పుకోవటం లేదట. ఈ నేపధ్యంలో అలియాభట్ లేని సీన్స్ తీయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. కానీ ఎంతకాలం పెండింగ్ లో పెట్టగలం అని భావిస్తున్నారట. 

ఇక  అలియా భట్  చేతిలో ప్రస్తుతం అన్నీ పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్కి పక్కా ప్లానింగ్ తో డేట్స్ ఇచ్చిన అలియా భట్.. కరోనా దెబ్బతో మొత్తం ప్లానింగ్ కొలాప్స్ అయ్యిపోయింది. దాంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి తంటాలు పడుతుందట.  ఇక అలియా పార్టుని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని చూస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం అలియా చేతిలో బ్రహ్మాస్త్ర - సడక్ 2 - తఖ్త్ - గంగూభాయ్ కత్వాడియా చిత్రాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ అలియా డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడాలంటోంది బాలీవుడ్.
 
అయితే  ఈ సినిమాపై ఆలియాభట్ ఎంత ప్రేమ పెంచుకుందంటే...తెలుగు నేర్చుకోవడానికి ఆలియా ట్యూటర్‌ను నియమించుకున్నారు. ఈ విషయం గురించి ఆలియా ఓ మీడియా తో మాట్లాడుతూ.. ‘తెలుగు నేర్చుకోవడం నాకో ఛాలెంజ్‌ అనే చెప్పాలి. భాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ అన్ని భావాలను పండించగలిగే చక్కని భాష ఇది. ఆ పదాన్ని అలా ఎందుకు పలుకుతారు? ఇలా ఎందుకు అంటారు?వాటి అర్థమేంటి?వంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. 

అప్పుడే నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలను. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే ముగ్గురు దర్శకులతో తప్పకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. వారిలో కరణ్‌ జోహార్, సంజయ్‌ లీలా భన్సాలీ, రాజమౌళి ఉన్నారు. కరణ్‌ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు భన్సాలీ, రాజమౌళి సర్‌లతో పనిచేస్తున్నాను’ అని వెల్లడించారు ఆలియా. భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.