Asianet News TeluguAsianet News Telugu

వేశ్య గృహం నడిపే పాత్రలో 'ఆర్ ఆర్ ఆర్' హీరోయిన్

చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

Alia Bhatt as a gangster in  Gangubai Kathiawadi
Author
Hyderabad, First Published Jun 10, 2020, 8:47 AM IST

టాలీవుడ్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమాలలో 'ఆర్ ఆర్ ఆర్' ఒకటి. దర్శక ధీరుడు  ఎస్ ఎస్ రాజమౌళి భారీఎత్తున చాలా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇండిపెండెన్స్ కు  ముందు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీంల జీవిత కథలను ఎంచుకొని సినిమాగా మలుస్తున్నారు జక్కన్న. ఇప్పటికే 70శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా చేస్తోంది. రామ్ చరణ్ సరసన ఈ చిత్రంలో చేస్తున్న  ఆమె ఇప్పుడు మరో సినిమాలో వేశ్యపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాని సైతం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో అలియా లీడ్ పాత్ర చేస్తోంది.సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వంలో “గంగు భాయ్ కతియవాది” అనే రియల్ లైఫ్ బయో పిక్ చిత్రాన్ని ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను కూడా ప్రారంభించిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన నిలిచిపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ అనంతరం బాలీవుడ్ లో షూటింగ్ మొదలు కానున్న మొదటి చిత్రం ఇదే అని తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ తర్వాత ముంబైలో వేసిన భారీ సెట్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది అని అందుకు సంబంధించిన షూటింగ్ ఫర్మిషన్స్ ను కూడా సంజయ్ లీలా భన్సాలీ తీసుకున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఆలియా ఒక లేడీ డాన్ రోల్ లో కనిపిస్తుండగా, అజయ్ దేవగన్ ..మాఫియా డాన్ కరీమ్ లాలా గా కనపడనున్నారు.  సంజయ్ ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం కొత్త ఆర్టిస్ట్ లతో  తెరకెక్కించనున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో అలియా భట్ క్రేజ్ రెట్టింపు కానుంది. దాంతో ఈ సినిమా రేట్లు భారీగా పలకనున్నాయి. తెలుగు,తమిళ భాషల్లో సైతం రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతల ఆలోచనగా చెప్తున్నారు. 
 
‘గంగూ భాయ్ కతియావాడి’ అనే టైటిల్ తో తెరక్కెక్కుతున్న ఈ మూవీ ముంబయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన కథ. ఆ ప్రాంతంలో గంగూబాయి అనే ఆవిడ తన చిన్న తనంలోనే వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దాంతో ఆమె అక్కడే వ్యభిచార గృహాలను నడుపుతూ రౌడీరాణిగా ఎదిగింది. ఈ వివరాలు అన్నీ ఈ మూవీలో ఇవి చూపించనున్నారు. నిజానికి ఈ మూవీలో అలియా ప్లేస్ లో ప్రియాంక చోప్రా చేయాల్సివుంది కానీ చివరి నిమిషంలో అలియా చేస్తుంది. ఇక ఈమూవీ 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడది సాధ్యమయ్యే పనికాదు. రిలీజ్ బాగా లేటు కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios