బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, క్రేజీ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్నారు. గత ఏడాది నుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్ కోనసాగిస్తున్నారు. అలియా భట్ రణబీర్ కుటుంబ సభ్యులతో కూడా కలసి పోతుండడంతో త్వరలో వీరి పెళ్లి ఫిక్స్ అనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. 

అలియా భట్, రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఓ ఈవెంట్ లో రణబీర్ కపూర్ అందరి ముందు అలియాకు ముద్దు కూడా ఇచ్చేశాడు. 

కుటుంబ సభ్యులు కూడా అలియా, రణబీర్ ప్రేమని అంగీకరించడంతో వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే చర్చ బాలీవుడ్ లో జరుగుతోంది. ఇదిలా ఉండగా అలియా, రణబీర్ వివాహం జనవరిలో జరగబోతోంది అంటూ ఓ ఫేక్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వెడ్డింగ్ కార్డు మొత్తం అక్షర దోషాలు కనిపిస్తున్నాయి. అలియా భట్ తాజాగా విమానాశ్రయంలో కనిపించగా మీడియా వెడ్డింగ్ కార్డు గురించి ప్రశ్నించింది. మేడం మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందా.. జనవరి 22న అంటున్నారు నిజమేనా అని ప్రశ్నించగా.. నేనేం మాట్లాడాలి.. తల అడ్డంగా ఊపుతూ, సిగ్గుపడుతూ తాన్ పెళ్లి వార్తని ఖండించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Good morning ❤ #aliabhatt

A post shared by Viral Bhayani (@viralbhayani) on Oct 21, 2019 at 9:32pm PDT