టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో  వస్తున్నా  సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి పాటలు టీజర్ లు ఇప్పటికే విడుదలై సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అన్ని వర్గాల అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో మేకింగ్ వీడియోని  విడుదల చేసింది చేశారు. సినిమాలో త్రివిక్రమ్ చిత్ర యునిత్ తో కలిసి నవ్వుతు షూటింగ్ చేయడం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది అలాగే షూటింగ్  స్పాట్ లో బన్నీ పిల్లలు అల్లు ఆయన్ - అల్లు అర్హ కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అయాన్ కెమెరాను చూస్తూ నిర్మాత నేనే అని చెప్పడం బావుంది. ఆడియెన్స్ ని సీన్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.

ఇక మొన్న విడుదలైన 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ టీజర్ కూడా  ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ స్టైల్ పూజా అందాలు సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు.

ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు.హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.