స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన  మూడవ సూపర్ హిట్ చిత్రం “అల వైకుంఠపురంలో”. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొన్న సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడుతోంది. అలాగే తమన్ అందించిన పాటలు ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసాయి. కలెక్షన్స్ పరంగా  రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ చిత్రం మలయాళ భాషలో 'అంగు వైకుంఠపురతు' టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

 ఇక ఇటీవల ఈ సినిమాను అక్కడి సూర్య టెలివిజన్ లో ప్రసారం చేయగా, 11.17 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మలయాళ  టెలివిజన్ చరిత్రలో ఇది రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ అని అక్కడ మీడియా వర్గాల వారు అంటున్నారు. మొదటి నుంచీ అల్లు అర్జున్ కు మళయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు అక్కడ ఓ రేంజిలో డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో ప్రతీ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఆడుతోందో అక్కడ కూడా అదే స్దాయిలో ఆడి రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

ఈ నేఫధ్యంలో మలయాళంలో అల్లు అర్జున్ మరో హిట్ ను సొంతం చేసుకున్నందుకు, అక్కడ ఆయన సినిమాకి రికార్డుస్థాయి టీఆర్పీ రేటింగ్ రావడం పట్ల అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ కు నార్త్,సౌత్ అనే తేడా లేకుండా ఉన్న క్రేజ్ ని ఈ సినిమా ఎలివేట్ చేసింది. తెలుగు రాని వాళ్లు సైతం సబ్ టైటిల్స్ లో ఈ సినిమాని చూసి  నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో నెట్ ప్లిక్స్ కు తెలుగు వాళ్లు చాలా మంది చందా దారులు అవుతున్నారు.మరో ప్రక్క ఇది యూఎస్ అభిమానులకు కూడా  గుడ్ న్యూస్ గా చెప్పాలి ..వాళ్లంతా నెట్ ఫ్లిక్స్ లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా చూస్తూనే ఉన్నారు.