టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన మొదటిరోజు నుంచే 'అల.. వైకుంఠపురములో' స్ట్రాంగ్ కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది.  సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్ బయటకు వచ్చింది.

 

అల.. వైకుంఠపురములో ఈ ఏడాది అత్యధిక షేర్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 160.37కోట్లను రాబట్టిన బన్నీ త్రివిక్రమ్ కాంబో అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ అందించింది. ఇక గ్రాస్ పరంగా 256.36కోట్లను అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ చాలా కాలం తరువాత కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక త్రివిక్రమ్ కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అని చెప్పవచ్చు.

ఏరియాలవారీగా సినిమా కలెక్షన్స్ (షేర్స్) ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం 44.88 cr 

సీడెడ్ 18.27 cr 

ఉత్తరాంధ్ర 19.93 cr 

ఈస్ట్ 11.44 cr 

వెస్ట్ 8.96 cr 

కృష్ణా 10.79 cr 

గుంటూరు 11.18 cr 

నెల్లూరు 4.72 cr 

రెస్ట్ ఆఫ్ ఇండియా 11.85 cr 

ఓవర్సీస్ 18.35 cr 

వరల్డ్ వైడ్ టోటల్ 160.37 cr