టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. గణ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ వెంకన్న సన్నిధిని సందర్శించింది. నేటి ఉదయం తిరుమలలో అల్లు అర్జున్ సతి సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిత్ర యూనిట్ తో కలిసి తిరుమలకు వెళ్లారు.

ఈ సంక్రాంతికి విడుదలైన 'అల.. వైకుంఠపురములో' బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఇండియా వైడ్ గా కేవలం తెలుగులో 200కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రంఅల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.  చాలా వరకు 'అల.. వైకుంఠపురములో'అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ గత సినిమాలకంటే ఎక్కువగా యూఎస్ లో డాలర్స్ ని రాబడుతోంది. మెయిన్ గా థమన్ ఇచ్చిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఓపెనింగ్స్ తోనే సినిమా మంచి హైప్ క్రియేట్ చేసి డబుల్ సెంచరీతో దూసుకుపోతున్న బన్నీ ఇంకా ఎంతవరకు రాబడతాడో చూడాలి.