అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం గత ఏడాది నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబందించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మొదటిరోజు సినిమా ఎలాంటి ఎంతవరకు ఆకట్టుకుంటుందో గాని ఒక్క విషయంలో మాత్రం అభిమానులను మంచి ఫీల్ గుడ్ ని కలిగిస్తుందట.  సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు అందమైన లొకేషన్స్ మునుపెన్నడు చూడని విధంగా జనాలను ఆకర్షిస్తాయట. ముఖ్యంగా సాంగ్స్ చిత్రీకరించిన విధానం అందులో కనిపించే ప్రదేశంలో ఎంతగానో మైమరిపిస్తాయట.

బుట్ట బొమ్మ సాంగ్ లోని సెట్స్.. అలాగే.. సామజవరాగమన సాంగ్ సీట్ల నుంచి కదలనివ్వవట. దానికి తోడు అల్లు అర్జున్ స్టెప్పులు.. పూజా హెగ్డే అందాలు సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనున్నట్లు తే;తెలుస్తోంది.  త్రివిక్రమ్ ఈ సినిమాలో లొకేషన్స్ తో ఎదో మాయ చేస్తున్నట్లు అనిపిస్తుందట. మొత్తంగా సినిమాలో ఏది తేడా కొట్టినా సాంగ్స్ తెరపై మాత్రం 100% ఆకట్టుకుంటాయని ఇన్ సైడ్ టాక్.

ఇక సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా దర్శకుడు త్రివిక్రమ్ ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఈ సినిమా స్పెషల్ షోని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ కంటే ముందుగానే RRR స్టార్స్ 'అల వైకుంఠపురములో' సినిమాని చూడనున్నారట.