స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కాబోతోంది. బోనస్ గా అల్లు అర్జున్ కి సంబందించిన ఒక స్పెషల్ లుక్ ని కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్క్ కి తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా స్టిల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

రీసెంట్ గా విడుదలైన ఒక యాక్షన్ స్టిల్ క్లిక్కయిన విషయం తెలిసిందే. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో టేబుల్ మీద ఉండే ఫిన్నిస్ కి కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇక అలా వైకుంఠపురములో కూడా అలాంటి తరహాలోనే సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  మొన్న దసరా కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఎర్రటి బట్టతో అల్లు అర్జున్ కూడా విలన్లను చితకొట్టినట్లు అర్ధమవుతోంది.

గతంలో క్లాత్ తో త్రివిక్రమ్ ఇలాంటి మ్యాజిక్ లు చాలా చేశాడు. మరి ఈ సారి ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.  ఇక ఇప్పుడు కోడిపుంజుతో దర్శనమిచ్చాడు/ రీసెంట్ గా రిలీజైన సామజవరగమన సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.