అల్లు అర్జున్ కు తెలుగునాటే కాదు మళయాళంలోనూ ఓ రేంజిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు అక్కడ మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంటాయి. కాబట్టి బన్నీ తన సినిమాలు కేరళ రిలీజ్ కు ప్రయారిటీ ఇస్తూంటారు. ఇదే పద్దతిలో  అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న  ‘అల వైకుంఠపురంలో’ ని సైతం అక్కడ బారీగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు . “అంగు వైకుంఠ‌పుర‌త్తు” అనే టైటిల్‌తో మ‌ల‌యాళ వ‌ర్షెన్ విడుద‌ల కానుండ‌గా, చిత్రం నుండి సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే మ‌ల‌యాళ వర్షెన్ పాటని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ పాట‌తో మ‌ల‌యాళంలోను సినిమాపై హైప్ క్రియేట్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. అక్కడ కూడా అదే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో అక్కడ బిజినెస్ ఎంక్వైరీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అక్కడి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా బిజినెస్ పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. భారీ మొత్తానికే మళయాళ రైట్స్ వెళ్తాయని అంటున్నారు. అక్కడ మీడియా సైతం ఈ విషయమై కథనాలు వెలువరిస్తోంది. మళయాళ మీడియాలోనూ ఎప్పటికప్పుడు ఈ సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. దాంతో అక్కడ క్రేజ్ మామూలుగా లేదు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య, రోహిణి,ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్,అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు).