ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా సెల్రబిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ సమయంలో తమ అభిమానులను అలరించేందుకు సినీ తారలు తమవంతుగా శ్రమిస్తున్నారు. హాట్ బ్యూటీస్‌ తమ వర్క్‌ అవుట్ వీడియోస్‌ ను పోస్ట్ చేస్తుండగా మరికొంత మంది అందాల భామలు త్రో బ్యాక్ వీడియోస్‌, ఫోటోస్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి విద్యా బాలన్ ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది.

ఇటీవల విద్యా బాలన్, అక్షయ్‌ కుమార్‌లు కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించారు. స్పేస్ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్‌, శర్మాన్ జోషిలు కీలక పాత్రల్లో నటించారు. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటనను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది విద్యా.

మిషన్ మంగళ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో షూటింగ్ గ్యాప్‌లో అక్షయ్‌, విద్యాలు ఫైటింగ్ చేస్తున్నట్టుగా నటించారు. ఈ వీడియోను సోనాక్షి, నిత్యా మీనన్‌, తాప్సీలు షూట్ చేశారు. విద్యా బాలన్ ఈ వీడియో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నిత్యామీనన్ స్పందిస్తూ `ఆ షూటింగ్ ఎంతో ఆనందంగా సాగింది. మిమ్మల్ని మిస్‌ అవుతున్నా` అంటూ కామెంట్ చేసింది.