ఒక సారి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు రిలీజైన మొదటిరోజే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అందుకే ప్రమోషన్స్ తో మన హీరోలు అలుపులేకుండా హడావుడి చేస్తారు. ఎంత సందడి చేసినా మొదటి షోకి పాజిటివ్ టాక్ రాకుంటే కలెక్షన్స్ రావడం కష్టంగా మారుతుంది.

కానీ అక్షయ్ కుమార్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన కలెక్షన్స్ అందుతుంటాయి.  రిలీజైన మొదటిరోజే అక్షయ్ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటాడు. ఇక రెండవరోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద తన క్రేజ్ పెంచుకుంటూ ఉంటాడు. ఇటీవల విడుదలైన గుడ్ న్యూస్ సినిమా మొదటిరోజు(శుక్రవారం) 15కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

ఇక రెండవరోజ్జు 21కోట్లు రాబట్టిన అక్షయ్ ఆదివారం కూడా ఆ డే రేంజ్ లో కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.  ఫస్ట్ వీకెండ్ లో గుడ్ న్యూస్ సినిమా టోటల్ గా 60కోట్ల వరకు వసూళ్లను సాధించినట్లు సమాచారం. గతంలో కూడా అక్షయ్ కుమార్ సినిమాలు ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్నాయి.

మెయిన్ గా హౌజ్ ఫుల్ 4 సినిమా అయితే బాలీవుడ్ క్రిటిక్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈజీగా 200కోట్లను దాటేసింది. ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి. అక్షయ్ కుమార్ - కరీనా కపూర్ - కియారా అద్వానీ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు రాజ్ మెహతా దర్శకత్వం వహించారు.