నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రూపొందించిన 'కాంచన' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాను ఇప్పుడు 'లక్ష్మీ బాంబ్' పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు.

దర్శకుడు రాఘవ లారెన్స్ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో అక్షయ్ కాసేపు ట్రాన్స్‌జెండర్ గా కనిపిస్తాడు.

అయితే అక్షయ్ కుమార్ తో కలిసి ట్రాన్స్‌జెండర్ల కోసం చెన్నైలో ఓ వసతి భవంతిని నిర్మించాలని అనుకుంటున్నట్లు లారెన్స్ కొన్నాళ్ల క్రితం వెల్లడించారు. అది గుర్తు పెట్టుకున్న అక్షయ్ తాజాగా ఆ భవంతి నిర్మాణం కోసం తనవంతు సహాయంగా రూ.1.5 కోట్లు అందించారు.

ఈ సందర్భంగా లారెన్స్.. అక్షయ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఇలాంటి వసతి గృహాన్ని నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. ఇక సినిమా విషయానికొస్తే.. 'లక్ష్మీబాంబ్' సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.